విశ్వవిజేతగా ఆసీస్ అవతరించింది. నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కంగారూలు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 6 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించారు. తొలుత టీమిండియాను 240 పరుగులకు పరిమితం చేసిన ఆస్ట్రేలియన్లు… 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించారు. తద్వారా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచకప్ టైటిల్ ను సాధించారు. టాస్ ఓడిపోవడం నుంచి ట్రావిస్ హెడ్ అసాధారణ ప్రదర్శన వరకు టీమిండియాకు అన్ని ప్రతికూలంగానే మారాయి.
ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ మందకోడిగా ఉన్న పిచ్ పై చెలరేగింది. ఈ ప్రపంచకప్ లో సత్తా చాటిన టీమిండియా టాపర్డర్…. ఈ మ్యాచ్ లో తేలిపోయింది. ఇది ఇలా ఉండగా… వరల్డ్ కప్ ఫైనల్ అయిపోయిన తరుణంలో ఫ్రైజ్ మనీలను ప్రకటించంది ఐసీసీ. వరల్డ్ కప్ 2023 విజేత ఆస్ట్రేలియాకు రూ. 33.29 కోట్లు ఇచ్చేసింది ఐసీసీ. అలాగే.. రన్నరప్ భారత్ కు రూ. 16.64 కోట్లు, సెమీస్ లో ఓడిన జట్టుకు రూ. 6.65 కోట్లు, గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్టుకు రూ. 83.22 లక్షలు ఇచ్చింది ఐసీసీ.