రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేనిస్థితికి తీసుకువచ్చింది బీఆర్ఎస్ : కిషన్ రెడ్డి

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, మీట్ ది ప్రెస్​లతో ప్రజల్లోకి వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు.. కాంగ్రెస్​పై విమర్శలతో.. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వంటి వారం కాదంటూ.. మేనిఫెస్టోను అధికారంలోకి రాగానే అమలు చేసి మాట మీద నిలబడే పార్టీ నుంచి వచ్చిన వారమని ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్​లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కార్​పై, కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అభివృద్ధి కుంటు పడుతుందని నొక్కి వక్కాణించి చెబుతున్నారు. కేసీఆర్‌ అవినీతిపై సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జితో విచారణ జరిపిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జితో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.

“రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటేనే సాధ్యం. రాష్ట్ర ఆర్థిక మూలాలను బీఆర్ఎస్ దెబ్బతీసింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని కోలుకోలేనిస్థితికి తీసుకువచ్చింది. 1 వ తేదీన జీతాలు ఇవ్వలేని స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ , కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది.” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news