వన్డే ప్రపంచ కప్ 2023లోను టీమిండియాకు నిరాశే ఎదురయింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా…. కీలక మ్యాచ్లో తేలిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో సమిష్టిగా విఫలమైన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
అయితే…ఈ వరల్డ్ కప్ తో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండు సంవత్సరాల కాలపరిమితి కూడా ముగిసింది. వరల్డ్ కప్ వరకు అంటే ఈ నెలాఖరు వరకు ఆయనను హెడ్ కోచ్ గా అపాయింట్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఆయన కాంట్రాక్ట్ ను పొడిగించాలా? లేదా? అనేది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంది.
పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోను ఇదే విషయాన్ని ప్రస్తావించాడు రాహుల్ ద్రవిడ్. తన టెన్యూర్ పొడిగింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని వాక్యానించారు. దీని మీద తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని తేల్చి చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ గా ఇదే చివరి పేస్ కాన్ఫరెన్సా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు.