న్యూస్ చదువుతూ సొమ్మసిల్లి పడిపోయిన దూరదర్శన్ యాంకర్

-

దేశవ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. ఇలా వేడి గాలులకు సంబంధించి వార్తలు చదువుతోన్న ఓ మహిళా యాంకర్‌ .. వాతావరణ సమాచారం అందిస్తోన్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ దూరదర్శన్‌ ఛానల్‌లో చోటు చేసుకొంది.

సిబ్బంది సమయానికి స్పందించడంతో ఆమెకు అపాయం తప్పింది. బీపీ తగ్గడంతోనే పడిపోయినట్లు తన పరిస్థితి గురించి తెలుపుతూ యాంకర్‌ లోపాముద్ర సిన్హా సోషల్‌ మీడియాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కాకముందే నాకు అసౌకర్యంగా అనిపించింది. కాస్త కుదుటపడిన అనంతరం ప్రసారం మొదలైంది. వార్తలు చదువుతుండడంతో చాలా సేపు నీరు తీసుకోలేదు. దీంతో ఒక్కసారిగా నా కళ్లకు చీకట్లు అలుముకున్నాయి. ఆ తర్వాత ఆకస్మికంగా పడిపోయా’’ అని వివరించారు. ఆమె పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. సిన్హా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్లు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version