భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు ద్రౌపది ముర్ము. కాసేపటి క్రితమే.. ద్రౌపది ముర్ము చేత సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీ రమణ.. ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ రోజు ఉదయం 8.30 గంటలకు రాజఘాట్ లో జాతిపిత మహాత్మ గాంధీ కి నివాళులు అర్పించిన ద్రౌపది ముర్ము…. రాజఘాట్ నుంచి తన తాత్కాలిక నివాసానికి తిరిగి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు ఈ రోజు ఉదయం 9.22 గంటలకు వెళ్లారు.
రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ భవనంకు వచ్చిన ద్రౌపది ముర్ము ను ప్రధాని మోడి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎమ్.వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా లు పార్లమెంట్ “సెంట్రల్ హాల్” కు తీసుకుని వెళ్లారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు ఈ రోజు ఉదయం 10.10 గంటలకు చేరుకున్న ద్రౌపది ముర్ము… ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.