తన బర్త్ డే రోజు ఆ విద్యార్థులకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన కేటీఆర్

-

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినవారందరికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ట్విటర్ వేదికగా భావోద్వేగకరమైన పోస్టు చేశారు. మూడేళ్ల క్రితం తన పుట్టిన రోజున ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్​ కార్యక్రమం తనకు ఎంతో తృప్తినిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒక్కడిగా ప్రారంభించిన ఆ కార్యక్రమంలో తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులంతా భాగమై తమకు చేతనైనంత సాయం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా.. “గిప్ట్‌ ఏ స్మైల్‌” కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు బైజ్యూస్‌ సాప్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్‌, స్టడీ మెటీరియల్‌ను కేటీఆర్​ అందించారు. పోటీ పరీక్షలకు అదనపు మెటీరియల్‌గా ఉపయోగపడుతుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

పలువురికి ఉపయోగపడేట్లు జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్న ఆలోచనతో మూడేళ్లు క్రితం “గిప్ట్‌ఏస్మైల్‌” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. గిప్ట్‌ ఏ స్మైల్‌ కింద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తికరంగా, గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. అందరి ప్రేమ,ఆప్యాయతలకు శాశ్వతంగా కృతజ్ఞుడనని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version