భారత 15వ రాష్ట్రపతిగా రేపు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే 29 మంది మీడియా అధిపతులకు ఆహ్వానం, 79 మంది ఫోటోగ్రాఫర్లు, టి.వి కేమెరామన్లు కు అనుమతి ఇచ్చారు అధికారులు. మీడియా ప్రతినిధులకు 1 గంటకు పార్లమెంట్ లో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ఇక రేపు ఉదయం 8.30 గంటలకు రాజఘాట్ లో జాతిపిత మహాత్మ గాంధీ కి నివాళులు అర్పించనున్న ద్రౌపది ముర్ము… రాజఘాట్ నుంచి తన తాత్కాలిక నివాసానికి తిరిగి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు.
రాష్ట్రపతి భవన్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు ఉదయం 10.10 గంటలకు చేరుకోనున్న రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము…. రేపు (సోమవారం) ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత రాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము తో ప్రమాణ స్వీకారం చేయుంచనున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. ఉప రాష్ట్రపతి (రాజ్యసభ ఛైర్మన్), ప్రధాన మంత్రి, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్యాధికారులు, ఉన్నాతాధికారులు, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.