బెస్ట్ క్రికెట్ ఆడలేకపోయాం..WTC ఓటమిపై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు

-

వరుసగా రెండవసారి ఫైనల్ వరకు వెళ్లి పరాభవాన్ని చవిచూసింది భారత్. 209 పరుగుల తేడాతో భారత్ పై ఛాంపియన్స్ గా ఆస్ట్రేలియా నిలిచింది. 280 పరుగుల లక్ష్యంతో 5వ రోజు బరిలోకి దిగిన టీం ఇండియా మొదటి నుండి తడబడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 234 పరుగులకే కుప్పకూలింది. 444 పరుగుల రికార్డు టార్గెట్ ను చేదించడంలో రోహిత్ సేన పూర్తిగా విఫలమైంది.

అయితే ఈ ఓటమిపై టీమిండియా కోచ్ ద్రావిడ్ స్పందించాడు.  WTC ఫైనల్ లో బెస్ట్ క్రికెట్ ఆడలేకపోయామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ‘బ్యాటర్లు పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సింది. కానీ విఫలమయ్యారు. తొలిరోజు బౌలర్లు ఎక్కువ రన్స్ ఇచ్చారు. 469 రన్స్ ఇవ్వాల్సిన పిచ్ కాదిది. మన ప్లేయర్లు తమ సామర్థ్యానికి తగ్గట్లు ఆడలేదు. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఇంకాస్త సమయం ఉంటే బాగుండేది’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news