మహిళా పోలీసుతో అనైతిక సంబంధం.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్‌

-

ఓ మహిళతో అనైతిక సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి యూపీ పోలీసు విభాగం షాక్ ఇచ్చింది.  నేరానికి పాల్పడిన అతడిని కానిస్టేబుల్‌ స్థాయికి డిమోట్‌ చేస్తూ అక్కడి పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.
ఏం జరిగిందంటే..

క్రిపా శంకర్‌ కనౌజియా కానిస్టేబుల్‌ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి చేరుకున్నాడు.  మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఉన్నావ్‌లో సర్కిల్‌ ఆఫీసర్‌గా పని చేస్తుండగా.. కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పుర్‌లోని హోటల్‌కు వెళ్లి అధికారిక, వ్యక్తిగత ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేయగా.. ఫోన్‌ కలవకపోవటంతో అతడి భార్య ఉన్నావ్‌ ఎస్పీని సంప్రదించారు. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పుర్‌లోని హోటల్‌లో చివరిసారి అతడి ఫోన్‌ లొకేషన్‌ను గుర్తించారు.

వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు క్రమశిక్షణారాహిత్యం కింద  అతణ్ని గోరఖ్‌పూర్‌ బెటాలియన్‌లోని ‘ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ’లో కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version