గులాబీ పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…. వేధింపుల్లో భాగంగా తన పై ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదు చేశారని ఆగ్రహించారు.
నాతో పాటు నా భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కూడా కేసులు పెట్టారని… అలాంటి వాటికి భయపడకుండ న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని,కేసులు,అరెస్టులు నాకు కొత్త కాదని వెల్లడించారు బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారని వివరించారు బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.