మయన్మార్, థాయ్ లాండ్ లను భూకంపం వణికిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రకంపనలు రావడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసం కావడంతో శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారు. వెంటనే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు ప్రారంభించాయి. మరోవైపు థాయ్ లాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ భూకంపాలపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఆ దేశాలకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ రెండు దేశాల భూకంపం ఎఫెక్ట్ భారత్ పైనా పడింది.
మనదేశంలోనూ ఇవాళ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, కోల్ కతా, రాంచీ, త్రిపుర, అస్సోం, పట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి.