గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సచివాలయ నిర్మాణానికి ₹617.5 కోట్లతో నిర్మిస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారని..కానీ, సెక్రెటేరియట్ పూర్తయ్యే నాటికి దాని ఫైనల్ బిల్లు రూ.1,128 కోట్లకు పెంచారన్నారు.
దాదాపు రూ.500 కోట్లు అదనంగా బిల్లు అయ్యిందని గుర్తుచేశారు.ఆ కాంట్రాక్టర్లకు మాజీ సీఎం కేసీఆర్ బిల్లులు కూడా చెల్లించలేదని గుర్తుచేశారు. అదేగాక యాదగిరిగుట్ట పునరాభివృద్ధికి రూ. 360 కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు.ఇలా రూ. 10వేల కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పాలనపై సీరియస్ అయ్యారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సచివాలయ నిర్మాణానికి ₹617.5 కోట్లతో నిర్మిస్తాం అని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని, ఫైనల్ బిల్లు ₹1128 కోట్లు చేశారు, దాదాపు 500 కోట్లు అదనంగా బిల్లు అయింది.
ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు
అదేకాక యాదగిరిగుట్ట పునరాభివృద్ధికి ₹360 కోట్ల… pic.twitter.com/XleXp9Ufza
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2025