మోదీ సర్కార్ నిర్ణయాలను ప్రశంసించారు కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. శుక్రవారం ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని మాట్లాడుతూ.. జి-20 సదస్సుకు భారతదేశం నాయకత్వం వహించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. భారత విదేశాంగ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ఉక్రెయిన్ – రష్యా యుద్ధం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు.
ఇతర దేశాల ఒత్తిడికి లొంగకుండా తటస్థ విధానం అనుసరిస్తూ మోడీ సర్కారు గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఇక జి-20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరు కాకపోవడం దురదృష్టకరమన్న మహాన్మోహన్ సింగ్.. లడఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తత విషయంలో ప్రధాని మోదీ జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దేశ భూభాగాన్ని కాపాడుకునే అవసరమైన చర్యలు తీసుకుంటారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.