ఇవాళ అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

-

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. కశ్మీరీ గేట్ సమీపంలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరుగుతాయి.

Former Prime Minister Manmohan Singh’s last rites with official ceremonies

ఇవాళ ఉ. 11.45 గంటలకు మతపరమైన కార్యక్రమాలు, ఆ తర్వాత దహన సంస్కారాలు ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్, పలువురు కేంద్ర మంత్రులు, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news