కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేబినెట్ కీలక నిర్ణయం..!

-

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీపావళి కానుకగా 3 శాతం డీ.ఏ. పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరుకుంది. గత ఏడాది కూడా పండుగల సీజన్ లోనే కేంద్రం 4 శాతం డీఏను పెంచింది. అదేవిధంగా రబీ సీజన్ 2025-26 కి సంబంధించి MSP ని క్వింటాల్ పై రూ.150 కి పెంచింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పై పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకుందని.. ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి ప్రేమను మరోసారి వ్యక్త పరిచింది. దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version