2014 వరకు 2850 MBBS సీట్లు, నేడు 8490 సీట్లు..ఇది కేసీఆర్ పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పోస్ట్ పెట్టారు. తెలంగాణలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు… తొమ్మిదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలిచిందన్నారు.
మెడికల్ సీట్ల సంఖ్యలో దేశంలో అగ్రస్థానానికి తెలంగాణ అని కొనియాడారు. నాడు అందని ద్రాక్షగా వైద్య విద్య, నేడు సాధారణ ప్రజలకు చేరువైన వైద్య విద్య అని తెలిపారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో 5 మెడికల్ కాలేజీలు, 9 ఏళ్ల బి ఆర్ ఎస్ పాలనలో 34 కు చేరిన మెడికల్ కాలేజీలు అంటూ గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2014 వరకు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు, నేడు 8490 సీట్లకు చేరిందన్నారు. ఇది కేసీఆర్ మార్క్ పాలన.. మార్పు పేరు చెప్పి ఎవరూ చెరిపేయలేని ఆల్ టైం రికార్డు అని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.