రైతులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజుల్లో అకౌంట్ల‌లో డ‌బ్బులు

-

కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. క‌రోనా క‌ష్ట‌కాలంలో కాస్త ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్పుడ క‌రోనా కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఇంకోవైపు ప‌నులు, ఉపాధిలేక ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో దేశానికి అన్నం పెడుతున్న రైతన్న‌ల‌కు ఇదో మంచి వార్త‌.

 

farmers

రైత‌న్న‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కిసాన్ స‌మ్మాన్ నిధి కింద మ‌రో రెండు రోజుల్లో అంటే మే 14న రూ.2000 రైతుల అకౌంట్ల‌లో జ‌మ చేయ‌నుంది. ఏడాదికి రూ.6వేల చొప్పున ఇస్తున్న మూడు విడుత‌లుగా ఇస్తున్న ప్ర‌భుత్వం ఈ విడ‌త నిధులు విడుద‌ల చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 7విడుత‌లు అంజేసిన ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఎనిమిదో విడ‌త డ‌బ్బులు అంద‌జేయ‌నుంది. ఈ విష‌యాన్ని కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ వెల్ల‌డించారు. ఎవ‌రికైనా వ‌చ్చాయో రాలేదో తెలుసుకోవ‌డానికి పీఎం కిసాన్ స్కీమ్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు. అక్క‌డ ఉన్న బెన్‌ఫిషియ‌రీ లిస్టు వ‌ద్ద మీ ఆధార్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే మీ డీటెయిల్స్ వ‌స్తాయి. దాన్ని బ‌ట్టి మీకు డ‌బ్బులు వ‌చ్చాయో లేదో తెలుసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version