“మీషో” ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 9రోజులు వేతనంతో కూడిన సెలవులు

-

ప్రముఖ ఈ కామర్స్ సంస్త మీషో ఉద్యోగులకు భారీ ఆఫర్ ఇచ్చింది. 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. తమ సిబ్బంది రెస్ట్ తీసుకొని రీచార్జ్ అయ్యేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఈ సంస్థ ప్రకటించింది. వరుసగా నాలుగో ఏడాది ఈ తరహా బ్రేకు ఇస్తున్నట్టు తెలిపింది.

తొమ్మిది రోజుల పాటు ల్యాప్ టాప్స్ ఉండవు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. ఈ రెస్ట్ అండ్ రీచార్జ్ బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 03 వరకు ఉండనుంది. మా మెగా బ్లాక్ బస్టర్ సేల్ తరువాత పూర్తిగా విశ్రాంతి తీసుకొని మాపై మేము దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్ అని మీషో సంస్త వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విధానం ఎంతో సంతోషానప్ని ఇస్తుందంటూ ప్రశించారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నారో దీనిని బట్టి తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version