టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ తాజాగా టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. “ఈ ఏడాది నవంబర్ లో డేవిస్ కప్ ఫైనల్స్ లో చివరి సారి ఆడుతా. వాస్తవం చెప్పాలంటే.. గత కొద్ది సంవత్సరాలుగా చాలా కష్టంగా గడిచాయి. ముఖ్యంగా గత రెండేళ్లు ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడం ఎ:తో కష్టమైన నిర్ణయం. అందుకు నాకు ఎంతో సమయం పట్టింది. జీవితంలో ప్రతీదానికి ప్రారంభం ఉన్నట్టే.. ముగింపు కూడా ఉంటుంది” అంటూ సోషల్ మీడియా వేదిక గా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసి అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు.
ఇప్పటి వరకు ఈ స్పెయిన్ బుల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుపొందాడు. గాయాల కారణంగానే 38 ఏళ్ల రఫెల్ నాదల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. స్పెయిల్ బుల్ గా పేరు పొందిన నాదల్.. టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్ వంటి దిగ్గజాలు టెన్నిస్ ను ఏలుతున్న రోజుల్లో నాదల్ ఆరంగేట్రం చేశాడు. సంచలనంగా దూసుకొచ్చిన నాదల్ అద్భుత విజయాలతో అందరినీ ఆశ్యర్యపరిచాడు.