ప్రతి ఒక్కరు కూడా మంచి తల్లిదండ్రులు అవ్వాలని అనుకుంటారు. మీరు కూడా ఉత్తమ తల్లిదండ్రులుగా ఉండాలని అనుకుంటే.. వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి. అవి మీ పిల్లలలో సానుకూలతను పెంచుతాయి పిల్లల్ని పెంచడం అంటే అంత ఈజీ కాదు. పిల్లలు రకరకాల ప్రవర్తనలు కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ తీరుని అర్థం చేసుకుని వారికి సున్నితంగా అన్నిటిని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్నది. అలాంటి సమయంలోనే తల్లిదండ్రులు సహనం నశించిపోతుంది. వారిపై అస్తమాను అరవడం, కొట్టడం వంటివి చేస్తారు. కానీ ఓపికతో ఉండాలి. ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు కనుక తల్లిదండ్రులుగా మనం వాళ్లతో ఎంత మంచిగా ఉన్నా మన ప్రవర్తన బట్టి భవిష్యత్తులో ప్రవర్తన ఉంటుంది.
పిల్లలతో రోజుల్లో ఒక గంటసేపైనా క్వాలిటీ టైం ని గడపండి. ఆ సమయంలో వారు సానుకూల దృక్పథంతో ఉండేలా సలహాలు ఇవ్వాలి. పిల్లలకు మనమే రోల్ మోడల్. మనం ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కాబట్టి వాళ్లకి ఉదాహరణగా నిలిచే ప్రవర్తనని అలవాటు చేసుకోండి. చిన్న చిన్న విషయాలను నేర్చుకున్న పిల్లలను పెద్దగా ప్రశంసించాలి. మెచ్చుకుంటే పిల్లలు ఇంకా బలంతో ప్రయత్నం చేస్తారు. ఎవరి నుంచి సహాయం తీసుకున్న కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోవాలి.
అందరికీ సహాయం చేయాలనీ కూడా నేర్పాలి. మధ్యాహ్నం పూట పిల్లలు స్కూల్లో మీరు ఇంట్లో లేదో ఆఫీసులో ఉంటారు. సాయంత్రం పూట మాత్రం కచ్చితంగా అందరూ కలిసి కూర్చుని భోజనం చేయాలి ఆహారం పై అవగాహనని ఇవ్వాలి. పిల్లలకి కంప్యూటర్లు, ఫోన్స్ వంటి వాటిని ఇవ్వదు. శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడడాన్ని ప్రోత్సహించాలి. అటువంటి వాతావరణాన్ని కల్పించండి పిల్లలతో సున్నితంగా ప్రేమపూర్వకంగా అర్థమయ్యే విధంగా మాట్లాడడానికి చూసుకోండి. విసుక్కోవడం వంటివి చేయొద్దు. నెగటివ్ మాటల్ని వాళ్ళ దగ్గర అనొద్దు.