క్రీడాకారులకు శుభవార్త..త్వరలో స్పోర్ట్స్ పాలసీ

-

CM Revanth reddy: క్రీడాకారులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. త్వరలో స్పోర్ట్స్ పాలసీ తెస్తామని ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…. అవార్డులు వస్తే ఆటోమేటిక్‌గా సాయం అందేలా పాలసీ చేస్తామన్నారు. పంజాబ్ తరహాలో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు ప్రకటన చేశారు. స్పోర్ట్స్ స్టేడియాలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు.

Good news for sportspersons Sports policy coming soon

భూమి అందుబాటులో ఉంటే మాకు నిధుల విడుదలకు ఇబ్బంది లేదన్నారు. బీసీసీఐతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. నేషనల్ అకాడమీ పెట్టాలని అనుకుంటున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఎల్బీ స్టేడియంలో కూడా స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అన్ని విధాల తెలంగాణ యువతను ఆదుకుంటామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news