గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లలోకి రూ.2 వేలు ఎప్పుడు వస్తాయంటే…?

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. అయితే ఆ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు బ్యాంక్ అకౌంట్‌లలో జమవుతూ వస్తాయి. దీనితో ఆర్ధికంగా రైతులకి కాస్త సహాయకరంగా ఉంటుంది.

మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. ఇప్పటికే 9 విడతల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మరో విడత డబ్బులు అంటే పదో విడత డబ్బులు అందాల్సి ఉంది. అయితే మరి ఇవి ఎప్పుడు పడతాయి అనేది చూస్తే… పీఎం కిసాన్ 10వ విడత డబ్బులు డిసెంబర్ 15 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయని అన్నారు.

కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. డిసెంబర్ 15 నుంచి 25లోగా అందొచ్చని తాజా నివేదికలు ద్వారా తెలుస్తోంది. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో అన్నదాతలకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి. అందుకనే 25లోగా డబ్బులు రావచ్చని తెలుస్తోంది.

ఇలా అనుకున్నట్టే డబ్బులు పడితే రైతులకి రిలీఫ్ గా ఉంటుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడ ఫార్మర్స్ కార్నర్ లోకి వెళ్లి దీనిపై క్లిక్ చేసి బెనిఫీషియరీ స్టేటస్ ని కనుక చూస్తే మీకు డబ్బులు పడతాయా లేదా ఎందుకు పడడం లేదు అనేవి తెలుసుకోచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version