Governor who shocked CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. స్థలాల అక్రమ పంపిణీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చారు గవర్నర్. స్థలాల పంపిణీలో అక్రమాలపై సిద్దరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇచ్చినారు. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములు తీసుకొని వేరే చోట భూములు మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) ఇచ్చింది.

ఇక స్వాధీనం చేసుకున్న భూముల కంటే ఇచ్చిన భూముల విలువ ఎక్కువ ఉందనే ఆరోపణ మీద గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఆర్టీఐ కార్యకర్త. ఇక దీనిపై సిద్దరామయ్య విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు గవర్నర్. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై సీఎంను విచారణకు రమ్మనడం తప్పంటూ, దాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది మంత్రి వర్గం. దీంతో స్థలాల అక్రమ పంపిణీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురు దెబ్బ తగిలింది.