తాగి మాట్లాడుతున్నావా.. పిచ్చిగా మాట్లాడకు : హర్భజన్ వార్నింగ్

-

తాగి మాట్లాడుతున్నావా.. పిచ్చిగా మాట్లాడకు అంటూ టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒకప్పుడు దాదాపు ఇస్లాంలోకి మతం మార్చే స్థాయికి వచ్చారని పాక్ మాజీ క్రికెటర్ ఇంజమాల్ ఉల్హాక్ ఇటీవల వ్యాఖ్యానించారు. తమతో భజ్జీ నమాజ్ చేసేవారని ఆయన పేర్కొన్నారు.

Harbhajan slammed Inzamam ul Haq over his revelation that he accepted Islam
Harbhajan slammed Inzamam ul Haq over his revelation that he accepted Islam

అవి నెట్టింట వైరల్ కావడంతో హర్భజన్ సింగ్ స్పందించారు. ‘ఈయన ఏ మత్తులో మాట్లాడుతున్నాడు? నేను భారతీయుడిని, సిక్కుని అని గర్వపడతాను. వీళ్ళు అర్థం పర్థం లేకుండా ఏదైనా వాగుతారు’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ గతంలో టీమిండియాకు అనేక సేవలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపు 6 ఏళ్ల కిందట టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించారు భజ్జీ.

Read more RELATED
Recommended to you

Latest news