గుజరాత్ కాంగ్రెస్ కు భారీ షాక్…. గుడ్ బై చెప్పనున్న హార్థిక్ పటేల్..!

-

కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగబోతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అసంత్రుప్తిగా ఉన్నట్లు ఇటీవల హార్థిక్ పటేల్ కామెంట్స్ చేశాడు. తాజాగా తన ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ ను తొలగించాడు. దీంతో హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖరారైంది. గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు భారీ షాక్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే హార్థిక్ పటేల్ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో  రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ నిర్ణయాన్ని బహిరంగంగానే హర్థిక్ పటేల్ మద్దతు పలికాడు. తను రఘువంశ్ కుటుంబానికి చెందిన వాడినని వందల ఏళ్ల నుంచి తాము హిందుత్వానికి కట్టుబడి ఉన్నామని హర్థిక్ పటేల్ గత నెలలలో హర్థిక్ పటేల్ వ్యాఖ్యానించారు. మరోవైపు పంజాబ్ లోలాగే గుజరాత్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ నుంచి కూడా హర్థిక్ పటేల్ కు ఆహ్వానాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version