గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు మరోకడు తెరపైకి వచ్చాడు. తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురి చేశాడు ఉపాధ్యాయుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు నైతం శ్రీనివాస్. గతంలో కూడా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేశాడని శ్రీనివాస్ పై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే…తాజాగా సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితురాలు కుటుంబ సభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.