కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న విమర్శలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఒకరిద్దరి నేతల కష్టం కాదని..కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చిందని ఆమె విమర్శకులకు సమాధానమిచ్చారు.
పార్టీ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ మల్లన్నను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి సీఎం కావడానికి తానే కారణమని మల్లన్న చెప్పడంపై ఆమె ఇలా స్పందించారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులను వదిలేసి.. ‘కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకులై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ చేయలేనిది మేం చేశాం..అభినందించాల్సింది పోయి విమర్శలా’ అని మంత్రి సీతక్క మండిపడ్డారు.