హైదరాబాద్ బిర్యానీ.. 10కి 20 మార్కులు : పాక్ బౌలర్

-

హైదరాబాద్ బిర్యానీ.. 10కి 20 మార్కులు అంటూ పాక్ బౌలర్ హరిస్ రవుఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే వరల్డ్ కప్ కోసం ఏడేళ్ల తర్వాత భారత్ కు వచ్చిన పాక్ క్రికెటర్లు… ఇక్కడ హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయ్యారు. తమ కరాచీ బిర్యానీ కంటే హైదరాబాద్ బిర్యానీ అద్భుతంగా ఉందని బౌలర్ హాసన్ ఆలీ చెప్పారు.

haris rauf on hyderabad biryani

దీనికి 10కి 20 మార్పులు వేస్తానని హరిస్ రవుఫ్ పేర్కొన్నారు. కాగా, తమ టీం కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించడంపై పిసిబి సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా,  వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 14 రన్స్ తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా జట్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version