నేషనల్ క్రష్ రష్మిక అభివృద్ధికి ఓటు వేయండి అంటూ ఇటీవలే ఓ పోస్ట్ పెట్టిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ముంబయి ట్రాన్స్ హర్భర్ లింక్ పై ఆమె ప్రయాణిస్తూ.. భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ ఆపలేరు. యువ భారత్ దేనిని అయినా సాధించగలదు. దేశంలో మౌలిక వసతులు, రహదారుల ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయి. 22 కిలోమీటరల్ పొడవున నిర్మించిన ఈ హర్భర్ లింక్ పై ప్రయాణం 2 గంటల సమయం నుంచి కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుందంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. కచ్చితంగా ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదు అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు మోడీ ట్వీట్ పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించింది. ఈ మేరకు సార్.. ఎంత గౌరవం.. ఎంతో గర్వించదగిన యువ భారతీయుడిగా మనదేశం ఎదుగుదలకు సాక్షమివ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక ట్వీట్ వైరల్ అవుతోంది.