తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రేపు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నవి, తెలంగాణ, ఏపీల మధ్య పరిష్కారం కాని అంశాల గురించి క్యాబినెట్ లో చర్చించనున్నారు. ఆగస్టు 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై చర్చ జరుగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యచరణ పై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్, కళాశాలలు ప్రారంభం కాకముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.