హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు ఈ మధ్య వరసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయనను వైల్డ్ చికెన్ వ్యవహారం ఇబ్బంది పెడుతోంది. సీఎం సుఖ్వీందర్ పాల్గొన్న కార్యక్రమంలో చికెన్ వడ్డించిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్ సింగ్, పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఏర్పాటు చేసిన విందు మెనూలో వైల్డ్ చికెన్ కూడా ఉంది. అదేవిధంగా దానిని వడ్డించిన వీడియో కూడా వైరల్ అయింది. వాస్తవానికి సీఎం సుఖ్వీందర్ ఆ వంటకం తిననప్పటికీ ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర అతిథులకు నిర్వాహకులు దానిని వడ్డించారు. ఆ చికెన్ మెనూలో చేర్చడాన్ని తప్పు పడుతూ జంతు సంరక్షణ సంస్థ ఒకటి వీడియోను పోస్టు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం.. రక్షిత జాతుల జాబితాలో వైల్డ్ చికెన్ కూడా ఉండటం విశేషం. వాటిని వేటాడటం శిక్షార్హం. దీంతో సీఎం, ఇతర నేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.