BREAKING : బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో మేజిక్ ఫిగర్ ను చేరుకుంది కాంగ్రెస్ పార్టీ. అటు హిమాచల్ ప్రదేశ్ లో అధికార బిజెపికి షాక్ తగిలే అవకాశం ఉంది.
ఆ పార్టీ ఆదిక్యం భారీగా పడిపోయి అధికారం కోల్పోయే దిశగా సాగుతోంది. కాంగ్రెస్ 38 స్థానాల్లో లీడ్ లో ఉండగా, బిజెపి ఆదిక్యం 26 స్థానాలకే పరిమితం అయింది. దీంతో మేజిక్ ఫిగర్ 35ను కాంగ్రెస్ దాటిపోయింది. అయితే ఆదిక్యంలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే అధికారం చేపట్టడానికి స్పష్టమైన మెజారిటీ దక్కుతుంది. కాగా.. హిమాచల్ ప్రదేశ్ బిజెపి అభ్యర్థి సీఎం జైరాం ఠాకూర్ గెలిచారు.