గోరఖ్ పూర్లో మరో ఇల్లు కూల్చివేత మాఫియా అంతానికి బుల్డోజర్ బాబా పంతం

-

ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే నా మాట నేనే వినను బ్లైండ్ గా వెళ్లిపోతా… ఓ తెలుగు సినిమాలో హీరో చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ కి సరిపోతుంది. చెప్పిన మాట ప్రకారమే మాఫియాని కూకటివేళ్ళతో సహా పెకళించి వేస్తున్నాడు యోగీ. మాఫియా ని, రౌడి గ్యాంగ్ లను ఏరి పారేస్తున్నారు. ఇప్పటివరకు చాలామందిని జైల్లో పెట్టించిన యోగీ మాట విననివారికి బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.తాజాగా గోరఖ్ పూర్ లోని ఓ డాన్ కి సంబంధించిన కొంపను కూల్చేశారు. మాఫియా పట్ల తాను కఠినంగా వ్యవహరిస్తాను అని మరోసారి రుజువు చేశారు యూపీ ముఖ్యమంత్రి.

మాఫియా లీడర్ వినోద్ ఉపాధ్యాయ్ సోదరుడు సంజయ్ ఉపాధ్యాయ్ అక్రమంగా కట్టుకున్న ఇంటిని కూల్చేశారు. షాపూర్ ప్రాంతంలోని శక్తినగర్‌కు చెందిన సంజయ్ ఉపాధ్యాయ్‌పై షాపూర్, గోరఖ్‌నాథ్, కాంట్, గుల్రిహా పోలీస్ స్టేషన్‌లలో గ్యాంగ్‌స్టర్, తిరుగుబాటు, హత్యాయత్నం, దోపిడీ, పోకిరీ చట్టం సహా వివిధ సెక్షన్ల కింద మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. ఇటీవల మాఫియాలీడర్ వినోద్‌తో పాటు సంజయ్‌పై కూడా భూకబ్జాలు, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అప్పటి సంజయ్ పరారీలో ఉన్నాడు.ఇతనిపై 25,000 రూపాయల రివార్డును కూడా ప్రకటించారు పోలీసులు.రివార్డు ప్రకటించినప్పటి నుంచి అతను కనిపించడం లేదు.

గుల్రిహా ప్రాంతంలోని సలెంపూర్ అలియాస్ మొగల్హాలో 450 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అనుమతులు,మ్యాప్ ఆమోదం పొందకుండా సంజయ్ ఉపాధ్యాయ అక్రమ నిర్మాణం చేసినట్లు విచారణలో తేలింది. GDA అధికారులు దీనిపై దావా వేసి, 2019 మే 24న విచారణకు హాజరు కావాలని సంజయ్‌కు నోటీసు ఇచ్చారు, కానీ అతను హాజరు కాలేదు. దీని తరువాత GDA నిర్మాణంలో ఉన్న ఇంటికి సీల్ వేసింది. సంజయ్ ఎక్కడున్నాడో తేలకపోవడంతో అతని ఇంటిని బుల్డోజర్ పెట్టి కూల్చేశారు అధికారులు. నేలమట్టమైన సంజయ్ ఉపాధ్యాయ ఇంటి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బుల్డోజర్ బాబాగా పేరుపొందిన సీఎం యోగీ మాఫియా అంతం కోసం తీసుకుంటున్న చర్యలు సంబంధిత వ్యక్తులను జైళ్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version