‘ఉప్పల్ స్కై వాక్​’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

-

హైదరాబాద్​లో ట్రాఫిక్ రద్దీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఉదయం గంట ముందే ఇంటి నుంచి బయల్దేరినా.. ఈ ట్రాఫిక్ వల్ల గమ్యస్థానాలకు కాస్త ఆలస్యంగానే చేరతాం. ఇక ఈ రద్దీలో రోడ్డు దాటే పాదచారుల భయం గురించి ఊహించలేం. ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి గుద్ది వెళ్లిపోతుందేమోనని భయంభయంగా రోడ్డు దాటుతుంటారు పాదచారులు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు నగరంలో పలు చోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి. దీన్ని నివారించేందుకే రాష్ట్ర సర్కార్ నగరంలో పలు చోట్ల పాదచారుల కోసం స్కైవాక్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్​లోని ఉప్పల్‌ జంక్షన్​లో ఏర్పాటు చేసిన స్కైవాక్‌ టవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.

ఉప్పల్ స్కై వాక్ ప్రత్యేకతలు..

  • 660 మీటర్ల మేర ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం
  • స్కైవాక్ నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టిన హెచ్‌ఎండీఏ
  • ఉప్పల్, సికింద్రాబాద్ రహదారులు, మెట్రోస్టేషన్‌తో స్కైవాక్‌ అనుసంధానం
  • ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రోస్టేషన్‌తో స్కైవాక్‌ అనుసంధానం
  • ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ నిర్మాణం
  • వృద్ధులు, మహిళలు, గర్భిణులు స్కైవాక్‌ చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం
  • స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు
  • 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు

Read more RELATED
Recommended to you

Exit mobile version