ఈరోజు గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎలా ఉంటున్నాయంటే…?

-

మన రాజ్యాంగం మన అందరికీ అమలు లోకి అందుబాటు లోకి వచ్చిన శుభదినమే..! గణతంత్య్ర దినోత్సవం. భారతీయులకు సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 71 ఏళ్ళు పూర్తయ్యి 72 లోకి అడుగుపెడుతూ… దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున ఉత్సవాలు, పరేడ్లు, విద్యాలయాల్లో జండా ఎగురవేయడం, సాంస్కృతిక ప్రదర్శనలు వంటివి ఎన్నో చేస్తారు. గణతంత్ర దినోత్సవం అంటే ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే “జాతీయ పండుగ”.

ఇది ఇలా ఉండగా రాజ్యాంగం గురించి చూస్తే… రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. 11 నెలల, 18 రోజుల కాలం శ్రమించి అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. రూ.64 లక్షలు రాజ్యాంగానికి ఖర్చయ్యింది.

ఈ ఏడాది రిపబ్లిక్ డే:

ఈ ఏడాది అట్టారి సరిహద్దులో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడం లేదు. జనవరి 26న భారత్, పాకిస్తాన్‌లు సంయుక్తంగా పరేడ్ నిర్వహించేవి. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అట్టారి బార్డర్‌లోకి అనుమతించడం లేకపోవడం తో అట్టారి సరిహద్దులో పరేడ్ లేదు.

మరో విషయం ఏమిటంటే గణతంత్ర పరేడ్‌కు పోటీగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల పరేడ్‌ నిర్వహించడం జరుగుతోంది. 5000 మంది వరకు రైతులు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారని అంచనా.

ఈ ఏడాది విదేశీ ప్రత్యేక అతిథి హాజరు కావడం లేదు. కరోనా వైరస్ కారణం గానే విదేశీ అతిథి లేకుండా భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం జరుగుతోంది.

అలానే 321 పాఠశాలల విద్యార్థులు మరియు 80 జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఈస్ట్ జోన్‌కు చెందిన కళాకారులు సైతం గణతంత్ర వేడుకలో పాల్గొనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news