ఇక నుంచి హార్లిక్స్ హెల్త్ డింక్ కాదు.. లేబుల్ మార్చేసిన కంపెనీ

-

ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ హార్లిక్స్‌ లేబుల్‌ను మారుస్తూ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో హెల్త్ ఫుడ్ డ్రింక్స్ కేటగిరిలో ఉన్న హార్లిక్స్‌ను ప్రస్తుతం ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్‌ కేటగిరిలోకి మార్చింది. హెల్త్‌ డ్రింక్స్‌ కేటగిరి నుంచి డ్రింక్స్, పానియాలను తొలగించాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) రితేష్ తివారీ తెలిపారు. హార్లిక్స్‌ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్(ఎఫ్‌ఎన్‌డీ) లేబుల్‌కు మారడం ఉత్పత్తిని మరింత కచ్చితంగా, పారదర్శకంగా వర్గీకరించేందుకు సులభతరం అవుతంది అని తివారీ అన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో డైరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడదని తెలిపింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్‌, లైమ్‌ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానీయాల కేటగిరీలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version