రింకూ బ్యాటింగ్ కోసమే మ్యాచ్‌లు చూస్తున్నా: రస్సెల్

-

రింకూ బ్యాటింగ్ కోసమే మ్యాచ్‌లు చూస్తున్నానని విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ పేర్కొన్నారు.  భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ లను తాను ఫాలో అవుతున్నానని, ఒకవేళ లైవ్ మిస్ అయితే హైలైట్స్ కచ్చితంగా చూస్తానని విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ చెప్పారు.

I tune in to India’s matches to watch Rinku Singh bat said Andre Russell

ముఖ్యంగా రింకూ సింగ్ బ్యాటింగ్ కోసమే తాను మ్యాచ్ వీక్షిస్తానన్నారు. అతని సత్తా తనకు తెలుసని, కేకేఆర్ జట్టు ప్రాక్టీస్, నెట్స్ లో భారీ షాట్లు ఆడేవాడని గుర్తు చేసుకున్నారు. అతను అద్భుతమైన ఆటగాడని, భవిష్యత్తులో మరింత రాణిస్తాడని పేర్కొన్నారు.

కాగా, నిన్న టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో ఐదు టి20ల సిరీస్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమిష్టిగా రాణించిన టీమిండియా 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో అయిదు టి20ల సిరీస్ ను టీమిండియా 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news