ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నాలుగో విడత విద్యా దీవెన నిధులను ఈనెల 7న విడుదల చేయనున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది.
విద్యార్థులకు పూర్తి రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 28న 8,44,336 మంది ఖాతాల్లో రూ. 680 కోట్లను సీఎం జమ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ నుంచి ట్యాబులు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. ట్యాబుల్లో పిల్లల సందేహాలను తీర్చే యాప్లను ఇన్స్టాల్ చేస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు. పదవ తరగతి ఫెయిల్ అయిన వారిలో లక్ష 49 వేల మంది పునఃప్రవేశాలు పొందాలని వివరించారు.