జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలిస్తే.. రూ.450కే సిలిండర్ : రాహుల్ గాంధీ

-

జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలిస్తే.. రూ.450కే సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత  రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జంషెడ్ పూర్ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూ.450కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. నిధులు కేటాయించే 90 ఉన్నతాధికారులలో బీసీలు, ఎస్సీలు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. మంది దేశ జనాభాలో బీసీలు 90 శాతం మంది ఉన్నారు. పేద మహిళల అకౌంట్లలో రూ.2500 కేటాయిస్తామన్నారు. 

ముఖ్యంగా మైనార్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మరిచిపోయింది. నల్ల చట్టాలు తీసుకొచ్చిన మోడీ అదానీ, అంబానీలకు మేలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తోందన్నారు. జార్ఖండ్ లో కూడా అలాగే అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 7 గ్యారెంటీ హామీలను తప్పక అమలు చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పై విమర్శలు చేసారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version