World Cup 2023 : ఇంగ్లండ్ ఓడితే ఆ టోర్నీ నుంచి కూడా ఔట్!

-

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుకు మరో అతిపెద్ద సవాల్ ఎదురైంది. 2025లో పాకిస్తాన్ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ జట్టు అర్హత సాధించాలంటే ఈ మెగా టోర్నీలో మిగిలిన రెండు మ్యాచ్లను తప్పక గెలవాలి. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో ఉండగా… నెదర్లాండ్ మరియు పాకిస్తాన్ జట్ల పై గెలిస్తే ఏడవ స్థానానికి చేరే అవకాశం ఉంటుంది ఇంగ్లాండ్ జట్టుకు..!

వరల్డ్ కప్ పాయింట్ల తొలి ఏడూ స్థానాల్లోని జట్లు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి అన్న సంగతి తెలిసింది. ఇలాంటి నేపథ్యంలో…ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటిలాగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news