IND VS PAK : మళ్లీ భారత్-పాక్ మ్యాచ్ జరగాలంటే.. లెక్కలివే

-

పాకిస్తాన్ శ్రీలంకపై ఘన విజయాలు సాధించిన భారత జట్టు 4 పాయింట్లు, మెరుగైన రన్ రేటుతో ఆసియా కప్ ఫైనల్ కు చేరింది. బంగ్లాదేశ్ పై గెలిచిన శ్రీలంక, పాకిస్తాన్ లు చేరో రెండు పాయింట్లతో ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఆ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కీలకం కానుంది.

ind vs pak

ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. ఒకవేళ వర్షంతో రద్దు అయితే మెరుగైన రన్ రేటుతో శ్రీలంక ఫైనల్ కు చేరుతుంది. కాగా, సూపర్ 4 లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. శ్రీలంక జట్టుపై ఏకంగా 41 విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… ఆది నుంచి తడబడుతూ కనిపించింది.

ఈ తరుణంలోనే… 49 ఓవర్లో 213 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 53 పరుగులు, ఈశాన్ కిషన్ 33 పరుగులు కేఎల్ రాహుల్ 39 పరుగులు అక్షర పటేల్ 26 పరుగులతో ఆదుకున్నారు. ఇక లక్ష చేదనలో బరిలోకి దిగిన… శ్రీలంక జట్టు 41 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version