ఉక్రెయిన్ పై రష్యా అణుదాడిని అడ్డుకోవడంలో భారత్ ది ముఖ్యపాత్ర : అమెరికా

-

ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక దశలో ఉక్రెయిన్పై రష్యా అణుదాడి చేయాలని భావించినట్లు సమాచారం. అయితే అణుదాడికి పాల్పడితే ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై అమెరికా 2022లోనే పూర్తి స్థాయి కసరత్తు చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గానికి చెందిన ఇద్దరు అధికారులు ఓ ఇంగ్లీష్ మీడియాకు వెల్లడించారు. అణుసంక్షోభ నివారణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు చైనా అధినేత చేసిన ప్రకటనలు, అందించిన సహకారం ముఖ్యపాత్ర పోషించాయని సదరు నివేదిక పేర్కొంది.

“ఖేర్సాన్‌లో రష్యా ఎదురు దెబ్బలు తింటున్న వేళ అణుదాడి జరగవచ్చని వాషింగ్టన్‌ భావించినట్లు సమాచారం. ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలోనిదిగా అప్పటికే మాస్కో ప్రకటించడం వల్ల పుతిన్‌ ఈ దాడికి పచ్చజెండా ఊపవచ్చని భావించినట్లు తెలిసింది. రష్యా అణుదాడికి పాల్పడకుండా నచ్చజెప్పేందుకు అమెరికా.. భారత్‌, చైనా దేశాల సాయం కోరింది. ఓ పక్క నేరుగా మాస్కోను హెచ్చరిస్తూనే మరోవైపు ఇతర దేశాలతో కూడా దానికి నచ్చజెప్పించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలు కొంత మేరకు సంక్షోభ భయాలు సర్దుమణిగేందుకు దోహదపడ్డాయి” అని యూఎస్ అధికారులు చెప్పినట్లు సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తన పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version