త్వరలో భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు!

-

భారత్​లో చీతాలు అంతరిస్తున్నాయని.. చీతాలను రానున్న తరాలు కూడా చూడాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. ఇందులో భాగంగా చాలా దశాబ్దాల తర్వాత ఇండియాలోకి కొత్త చీతాలు వచ్చాయి. అయితే అవి భారత్​కు వచ్చిన కొద్దిరోజులకే వివిధ కారణాలతో ఒక్కొక్కటిగా మృత్యువాత పడ్డాయి. ఆఫ్రికాలోని నమీబియాకు చెందిన ఈ చీతాలు భారత్​ వాతావరణాన్ని తట్టుకోలేకపోయాయి. అయితే మరికొన్ని చీతాలను తీసుకురావాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. అయితే ఈసారి నమీబియా నుంచి కాదట. ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి కొత్త చీతాలను తీసుకురాబోతున్నారట.

గతేడాది నమీబియా చీతాలు భారత్‌లోకి తీసుకువచ్చిన తర్వాత వాటిని సంరక్షించడంలో కఠిన సవాళ్లు ఎదురవ్వడం.. వాతావరణ మార్పుతో సమస్యలు రావడం జరిగాయి. దీనివల్ల చీతాలు మృతి చెందాయి. వింటర్‌ కోట్‌కు అలవాటు పడిన చీతాలు మనదగ్గర అధిక ఎండలకు తట్టుకోలేకపోయాయని అటవీ శాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే దక్షిణాఫ్రికా దేశాలతో పోలిస్తే.. ఉత్తర ఆఫ్రికా, ఈశాన్య దేశాల్లోని చిరుతలు మన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడతాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేసి చీతాలను తీసుకువచ్చేందుకు పరిశీలిస్తున్నారు. అక్కడి చీతాల సంతతి, వాటి ఆరోగ్య పరిస్థితి, బ్రీడింగ్‌ తదితర విషయాలను పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రాజెక్టు చీతా అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version