విద్యార్థుల హత్యతో మళ్లీ రగులుతున్న మణిపుర్.. ప్రత్యేకాధికారాల చట్టం పొడిగింపు

-

జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్ రాష్ట్రంలో అల్లర్లు ఇప్పుడిప్పుడు చల్లారుతున్నాయనుకుంటున్న సమయంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ మళ్లీ ఆ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తోంది. ఇద్దరు విద్యార్థుల హత్యకు సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ కావడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం వల్ల మణిపుర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం పరిధిని విస్తరించినట్లు బీరెన్‌సింగ్‌ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

మణిపుర్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని సర్కారు ప్రకటించింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం గడువును మరో ఆరు నెలలపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీరెన్​ సింగ్ సర్కార్ తెలిపింది. పొరుగు రాష్ట్రం అసోంతో సరిహద్దు కలిగిన ఇంఫాల్‌ లోయలోని 19 పోలీసు స్టేషన్లను ఈ చట్టం నుంచి మినహాయించినట్లు వెల్లడించింది. ప్రత్యేక అధికారాల చట్టం నుంచి మినహాయించిన 19 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా సైన్యం, అసోం రైఫిల్స్‌ ఆ ప్రాంతాల్లో ప్రవేశించటానికి వీలుండదు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 6 నెలల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version