భారతదేశంలో 2036 నాటికి వయోవృద్ధులు పెరిగిపోతారని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగనుందని వెల్లడించింది. ప్రస్తుత దేశ జనాభా 140 కోట్లు కాగా, 2036 నాటికి 152.20 కోట్లకు చేరి.. 2021లో జనాభా వార్షిక వృద్ధి రేటు 0.58కి పడిపోనుందని ఈ నివేదిక వెల్లడించింది.
అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రానున్న మార్పులకు, ఏ వయసు వారిలో జనాభా పెరుగుదల ఎంత ఉంటుంది? స్త్రీ, పురుష నిష్పత్తి వంటి వివరాలు అత్యంత కీలకమని ఈ నివేదిక చెప్పింది. రాబోయే పదేళ్ల (2026 – 36)లో వర్కింగ్ గ్రూప్ (15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు) శాతం పెద్దగా పెరగదని వెల్లడించింది. 2026 – 36 మధ్య కాలంలో పిల్లల శాతం తగ్గుతుంటే, వయోవృద్ధుల శాతం పెరగనుండటం ఆందోళన కలిగిస్తుందని ఈ నివేదిక పేర్కొంది.