వన్డే వరల్డ్ కప్ 2023 తుది దశకు చేరుకుంది. వన్డే వరల్డ్ కప్ లో అజయంగా దూసుకెళ్తున్న భారతజట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో 9కి 9 మ్యాచులు గెలిచిన రోహిత్ సేన రేపు న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ బెర్తుపై కన్నేసిన టీమిండియా ముంబైలోని వాంకడే స్టేడియంలో నవంబర్ 15 బుధవారం మధ్యాహ్నం జరిగే తొలి సెమీఫైనల్లో కివీస్ ను మరోసారి ఓడించాలనే పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో భారతజట్టు కోచింగ్ సిబ్బంది సోమవారం వాంకడే పిచ్ ను పరిశీలించింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ పిచ్ ను అసాంతం గమనించారు. బ్యాటింగ్ కు ఎంత మేరా అనుకూలిస్తుంది? టాస్ గెలిచాక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా? బౌలింగ్ చేయాలా? అనే దానిపై ఓ అంచనాకు వచ్చారు. అయితే… ముంబైలోని వాంకడే స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేస్తే..ఆడ్వాంటేజ్ ఉంటుందని సమాచారం.