అమెరికాకు చేరుకున్నారు భారత ప్రధాని మోదీ.. వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశంకానున్నారు భారత ప్రధాని మోడీ. ఈ తరుణంలోనే అమెరికాకు చేరుకున్నారు భారత ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వలసదారుల అంశంపై కీలక చర్చలు జరపనున్నారు మోదీ, ట్రంప్.
ఇక అటు ఫ్రాన్స్ ని మార్సెయిల్లో భారత నూతన కాన్సులేట్ ను ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సంయుక్తం గా ప్రారంభించారు. అంతకు ముందు మేక్రాన్ తో కలిసి భారత అమరవీరులకు మోడీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగా లకు గుర్తుగా గతంలో ఆ దేశ ప్రభుత్వం మార్సెయిల్ ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించింది. కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ చే దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.