అక్రమంగా వచ్చిన పాకిస్తాన్ వ్యక్తిని హతమార్చిన భారత జవాన్లు

-

అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ వ్యక్తిని హతమార్చారు భారత బీఎస్ఎఫ్ జవాన్లు. గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని భారత్–పా కిస్తాన్ బార్డర్ నుండి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ పౌరుడిని, ఈ నెల మే 23 వ తేదీన హతమార్చినట్టు ప్రకటించింది బీఎస్ఎఫ్.

Indian soldiers kill illegal Pakistani man
Indian soldiers kill illegal Pakistani man

ముందుకు వస్తే కాల్చేస్తామని చెప్పినా వినకుండా, ఫెన్సింగ్ వైపుకు దూసుకురావడంతో కాల్పులు జరిపామని ప్రకటనలో పేర్కొంది బీఎస్ఎఫ్. అటు గుజరాత్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్ అయ్యాడు. కచ్ బోర్డర్‌లో గూఢచారి సహదేవ్ సింగ్ గోళీని అరెస్టు చేసినట్టు ప్రకటించారు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్). ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తూ భారతదేశ సరిహద్దుల గురించి సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడని ప్రకటించారు ఏటీఎస్. పాకిస్తాన్ బీఎఎస్ఎఫ్ వద్ద రూ.40 వేలు తీసుకొని సమాచారం చేరవేస్తున్నట్టు అనుమానిస్తున్నారు ఏటీఎస్ బృందం.

 

Read more RELATED
Recommended to you

Latest news