భారతీయులు తనకు పరమాత్మతో సమానం : ప్రధాని మోడీ

-

ఢిల్లీలో పీఎంవోలో ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బందితో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక సూచనలు చేశారు. ఇది ప్రజల పీఎంవో అని.. మోడీ పీఎంవో కాదని పేర్కొన్నారు. అభివృద్ధికి అధికారులు ఒక వారధిలాంటివారు అని చెప్పారు. తాను అధికారంలో కోసమో. పదవి కోసమో లేనన్నారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు తనకు పరమాత్మతో సమానం అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. తమకు ఒకటే లక్ష్యం ఉందని.. ఈ దేశమే ప్రప్రథమం అన్నారు.

ఒకే స్పూర్తితో పనిచేస్తున్నామని.. 2047 నాటికి వికసిత భారత్ నిర్మించాలన్నారు. తన జీవితంలో ప్రతి క్షణం దేశం కోసమే అని ప్రధాని మోడీ పీఎంవో సిబ్బందితో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిన్న మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. 72 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 240 సీట్లను దక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్ ను మాత్రం చేరుకోలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version