ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దొరికిందట. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వెళ్తున్నహెలికాప్టర్ కూలిపోయినట్లు చాలా సేపటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్తుండగా జోల్ఫా సిటీ సమీపంలో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని సమాచారం.. కానీ ప్రస్తుతం ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్‌ను గాలింపు బృందాలు కనుగొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అటు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ దొరికిందని, అయితే పరిస్థితి బాగా లేదని ఇరాన్ రెడ్ క్రెసెంట్ చీఫ్ చెప్పారు. ప్రెసిడెంట్ రైసీ మరియు అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తమ సరిహద్దులో క్విజ్ ఖలాసి డ్యామ్‌ను ప్రారంభించిన తర్వాత ఇరాన్ నగరం తబ్రిజ్‌కు బయలుదేరిన సుమారు 30 నిమిషాల తర్వాత ప్రెసిడెంట్ రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ మరియు ఇతర అధికారులతో కూడిన హెలికాప్టర్ కూలిపోయింది.